Lokesh vs Mithun reddy: మిథున్ రెడ్డికి లోకేష్ సవాల్.. ఘాటు స్పందన!
Lokesh vs Mithun reddy: అన్నమయ్య జిల్లా పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ పెద్దిరెడ్డి కుటుంబ పై మరోసారి తీవ్రస్దాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో ఎంపీ మిధున్ రెడ్డికి లోకేష్ సవాల్ విసిరారు, చిత్తూరు జిల్లా గుప్పిట్లో పెట్టుకొని దోచుకోవడమే పెద్దిరెడ్డి కుటుంబం పని అని పేర్కొన్న ఆయన మదనపల్లెకీ ఏమి చేశావ్ మిధున్ రెడ్డి? దమ్ముంటే రా రేపు నేను తంబళ్ళపల్లెలోనే ఉంటాను అని అన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చ నేను రెడీ అని పేర్కొన్న ఆయన మీలాగా నన్ను అరెస్టు చేయాద్దుని బెయిల్ తీసుకుని టైపు కాదు నేను, మేము తప్పు చేయము, అభివృద్ధి మాత్రమే చేస్తామని అన్నారు. ఇక ఆరు నెలలో మదనపల్లె జిల్లాకు చేసే బాద్యత ఈ నారా లోకేష్ ది అని ఆయన అన్నారు. ఇక ఈ క్రమంలో నారా లోకేష్ కు ఎంపి మిధున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈనెల 12 తారీకు తంబళ్ళపల్లె చర్చ నేను సిద్దం, ప్లేస్ ఎక్కడో చెప్పు అని అన్నారు. చిత్తూరు జిల్లా డిఎన్‌ఏ…రక్తం ఉంటే నామీదా పోటి చేయ్ రా, చర్చకు సిద్దం, పోటీకి సిద్ధం అని అన్నారు. 12 తేదినా తంబళ్ళపల్లె హెడ్ క్వాటర్ లోనే ఉంటాను… నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు…లేదా నన్ను రమ్మంటే నేను వస్తానని అన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి పై చర్చకు నేను రెడీ, నోటిది ఏది వస్తే అది మాట్లాడటం కాదు, ఎవరో రాసి ఇస్తే చదవడం కాదు దమ్ముంటే రమ్మంటూ సవాల్ చేశారు.