Lokesh Padabhivandanam: మహిళలకు లోకేష్ పాదాభివందనం!
Lokesh Padabhivandanam: తన పాదయాత్రలో భాగంగా ఈరోజు మహిళలకు లోకేష్ పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ‘‘అమ్మలేనిదే జన్మ లేదు, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది’’ అంటూ సమావేశానికి వచ్చిన మహిళలకు లోకేష్ పాదాభివందనం చేశారు. మహిళలకు లోకేష్ ఇచ్చిన గౌరవం పట్ల అక్కడికి వచ్చిన మహిళలు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు 38వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా పీలేరు నియోజకవర్గం చింతపర్తి విడిది కేంద్రంలో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అప్పుడే మహిళలకు పాదాభివందనం చేసిన నారా లోకేష్ ఈ మహిళలతో ముఖాముఖిలో పలు సమస్యలు తెలుసుకున్నారు.
తమ సమస్యలు లోకేష్ దృష్టికి మహిళలు తీసుకురాగా మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టులు పెడితే తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై అఘాయిత్యాల నివారణకు చట్టాలతో పాటు చైతన్యం పెరగాలని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలపై దాడులు తక్కువగా ఉంటాయన్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాలను పరిశీలించి అమలు చేస్తామని అన్నారు. ఇక విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని, ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. ఇక విదేశీ విద్య పథకం పూర్తిగా నిలిపివేశారని ఇప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని అన్నారు.