TDP activists did not know Lokesh: లోకేష్‌కు శుభకార్యానికి, పరామర్శకు తేడా తెలియదు: ప్రభత్వ విప్ రామకృష్ణారెడ్డి
Ramakrishnareddy Comments:టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌పై ప్రభత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌కు శుభకార్యానికి, పరామర్శకు మధ్య అర్ధం తెలిదని ఎద్దేవా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ మెడలో దండలు వేసుకొని వెళ్లారని విమర్శించారు. పల్నాడులో లోకేష్ పరామర్శ పేరుతో ర్యాలీలు తీసే ప్రయత్నం చేశారన్నారు. మీసాలు మెలేసీ నోటికి వచ్చింది మాడ్లాడారన్నారు. లోకేష్ ముఖంలో నిరాశ, నిస్పృహ మాత్రమే కన్పించాయన్నారు.
లోకేష్‌కు జల్లయ్య అనే వ్యక్తి గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు రామకృష్ణా రెడ్డి. జల్లయ్యపై తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పది కేసులు నమోదయ్యాయన్నారు. మాచర్ల నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా పంపిన బ్రహ్మారెడ్డి గురించైనా లోకేష్‌కు తెలుసా అని ప్రశ్నించారు. హాఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్‌లో విహార యాత్ర చేసిన లోకేష్‌కు రాష్టంలో ఉన్న టీడీపీ కార్యకర్తల గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.