TV Ramarao: వైసీపీ కి రాజీనామా చేసిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు
TV Ramarao: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతంలో సొంతపార్టీ ని కాదని వైస్సార్సీపీ లో చేరిన నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కొంతమంది సొంత గూటికి చేరుతుంటే..మరికొంతమంది జనసేన, టీడీపీ పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. వైస్సార్సీపీ నేత , కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేసారు. త్వరలోనే ఈయన టీడీపీ లొ చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు, వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు . పార్టీలో సరైన గుర్తింపు తనకు ఇవ్వడం లేదని తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను అనితెలిపారు. 2009లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుండి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ, పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్ కు మద్దతుగా ప్రచారం చేసారు.తర్వాత 2019 ఎన్నికల్లోనైనా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా టికెట్ మాత్రం రాలేదు. దీంతో.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైస్సార్సీపీ లో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. తాజాగా పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదని వైస్సార్సీపీ కి రాజీనామా చేసారు. తన అనుచరులతో సమావేశం ఏర్పాటుచేసి ఏ పార్టీలో చేరడమో నిర్ణయిస్తానని తెలిపారు..