ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని జైలుకు పంపిస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రసంగంలో దియోధర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Kodali Nani will be sent to Jail, if BJP comes to Power in AP
ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని జైలుకు పంపిస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రసంగంలో దియోధర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని సునీల్ దియోధర్ విమర్శలు గుప్పించారు. నాని వంటి ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని దియోధర్ అభిప్రాయపడ్డారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను… క్యాషినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నాని…. జీవితంలో అసెంబ్లీ గడప తొక్క కుండ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జగన్ పాలనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
అవినీతి జగన్ పాలనను అంతం చేసేందుకు జనసేన, బిజెపి కలిసి పోరాడుతాయని సునీల్ దియోధర్ అన్నారు. శిక్ష పడిన ఖైదీ,బూతుల ఎమ్మెల్యేల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని సునీల్ దియోధర్ మండిపడ్డారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి…. జగన్ పాలనలో అంతకుమించి పది శాతం వేడితో ప్రజలు అల్లాడుతున్నారని సునీల్ దియోధర్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అరాచక వాదులు, అవినీతి పరులతో రాష్ట్రంలో అన్ని మింగేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్‌కు పంపుతున్నారని ఆరోపించారు.
ఇసుక,మద్యం,గంజాయి మాఫియాలదే ఏపీలో రాజ్యం నడుస్తోందని సునీల్ దియోధర్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ పాలన ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా సాగుతోందని విమర్శించారు.లూటీలు, అరాచకాలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై క్రిమినల్ చార్జ్‌షీట్ వేయాలని సునీల్ దియోధర్ అభిప్రాయపడ్డారు.