Kodali Nani: బాలయ్య డైలాగులపై కొడాలి మార్క్ కామెంట్స్.. ఏమీ ఊడవట!
Kodali Nani on Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి విషయంలో అలాగే మరికొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని నందమూరి బాలకృష్ణ టార్గెట్ చేసే విధంగా ఆ డైలాగులు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయంలో సీరియస్గా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనే విషయంలో తజ్జనభజనలు పడుతోంది. అయితే తాజాగా ఈ అంశం మీద వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వీర సింహారెడ్డి సినిమా డైలాగుల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీర సింహారెడ్డి సినిమా తాను చూడలేదని పేర్కొన్న నాని ఒకవేళ నిజంగా సినిమాలో ఏమైనా డైలాగ్స్ ఉన్నా సరే వాటి వల్ల ప్రభుత్వానికి వెంట్రుక కూడా ఊడదని పేర్కొన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న ఆయన చంద్రబాబు దొంగ అని ఆ దొంగ వెనుక బాలయ్య నిలబడ్డారని కొడాలి నాని విమర్శించారు. ఇక బాలకృష్ణ రీల్ హీరో అయితే జగన్ రియల్ హీరో అని మూడు రోజుల తర్వాత ఆ డైలాగులు ఎవరూ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఇలాంటి డైలాగులతో ఎన్నో సినిమాలు చేశారని, వాటి వల్ల ఏమీ ఊడలేదని ఆయన చెప్పుకొచ్చారు.