Kodali Nani: చంద్రబాబు, లోకేష్ లకు కొడాలి నాని సవాల్!
Kodali Nani: కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని, వైసీపీ గెలవని చోట గెలిచే సత్తా ఉందా అంటూ వైయస్ జగన్ కు తాజాగా తన పాదయాత్రలో నారా లోకేష్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ కు లోకేష్ సవాల్ విసరడాన్ని తప్పుబట్టి ఎదురు మరో సవాల్ విసిరారు. వైసీపీకి పోటీగా యువగళం సభ పెట్టాలని సవాల్ చేశారు నాని. అంతేకాదు దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ గుడివాడ, గన్నవరం నుండి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. గుడివాడలో వైసీపీ కృష్ణా జిల్లా యువజన విభాగ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రజల మద్దతుతో ఐదో సారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు విశాఖ సమ్మిట్ ఏర్పాటు చేశామన్న నాని జగన్‌ను అసమర్థుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు అండ్ కో అన్ని అడ్డ దారులు తొక్కుతున్నారన్నారు. జగన్ సింగిల్ గా పోటీ చేయమని చేసి ఛాలెంజ్‌కు సమాధానం చెప్పే దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు.