Kannababu: మాకు బాలకృష్ణ తక్కువా కాదు, చిరంజీవి ఎక్కువా కాదు?
Kannababu Crucial Comments on Balakrishna and Chiranjeevi: కాకినాడలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభంని ఏ చట్టం ప్రకారం నిర్బంధించారు, పరామర్శకి వస్తుంటే చిరంజీవిని రాజమండ్రిలో ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచారం కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్నాడని విమర్శించిన ఆయన జీవో నెంబర్ 1 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి చంద్రబాబుకి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, అధికార దాహం తప్ప చంద్రబాబుకి ఇంకేమీ లేదని అన్నారు.
చంద్రబాబుకి ప్రాణాలు అంటే అంత చులకనా? అని ప్రశ్నించిన ఆయన కందుకూరులో ఎవరు కుట్ర చేశారు.. అలా చెప్పడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కాపుల మీద వేల కేసులు పెట్టారని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ ఆంక్షలతో ఒంగోలులో నిర్వహించే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. కానీ విశాఖ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ముందు మారుస్తామని అన్నా చివరికి అదే ప్లేస్ ను ఫైనల్ చేశారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబును ప్రశ్నించగా బాలకృష్ణ సినిమా ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. తమకు చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ఒక్కటేనని అన్నారు.