ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి అండగా నిలిచారు. అవినాశ్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని అభిప్రాయపడ్డారు. కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.
KA Paul met Avinash reddy in Kurnool
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి అండగా నిలిచారు. అవినాశ్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని అభిప్రాయపడ్డారు. కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.
వైఎస్ విమలాదేవి హార్ట్ టచింగ్ వీడియో చూశానని కేఏ పాల్ తెలిపారు. టర్కీ వెళ్లాల్సిన తాను అవినాశ్ రెడ్డి తల్లిని చూడాలని కర్నూలు వచ్చానని తెలిపారు. తాను ముక్కు సూటిగా అవినాష్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగానని, వివేకా హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడని కే ఏ పాల్ వివరించారు.
తనను ఇరికించే ప్రయత్నము చేస్తున్నారని అవినాశ్ రెడ్డి చెప్పిన విషయాన్ని పాల్ వెల్లడించారు. ఎపుడూ పిలిచినా సీబీఐ విచారణకు వెళ్తానని అవినాశ్ రెడ్డి చెప్పిన విషయాన్ని కే ఏ పాల్ గుర్తుచేశారు. వివేకాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని కే.ఏ.పాల్ అభిప్రాయపడ్డారు.