Janasena: తిరుపతిలో జనసేన వినూత్న నిరసన
Janasena New Type of Protest: తిరుపతిలో జనసేన వినూత్న నిరసనకు దిగింది. డైమండ్ రాణి రోజా, మూడు ముక్కల సీఎం కు ముగ్గురు జోకర్లు అంటూ ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు. పవన్ యువశక్తి సభ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందని, 151 సీట్ల వైసీపీని రాబోయే ఎన్నికల్లో 15 సీట్లు కు పరిమితం చేస్తామని జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. మూడు ముక్కల సీఎంకు మంత్రులు అంబటి, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి పేర్ని నాని ముగ్గురు జోకర్లుగా మారారని, ….డైమండ్ రాణి రోజా నగరిలో రెండు సార్లు ఎలా గెలిచిందో రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందో చూస్తామని వారు హెచ్చరించారు. నిజానికి టీడీపీతో పొత్తు ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తిరుపతి జనసేనలో జోష్ కనిపిస్తోంది. ఈ సీటు తమకే పక్కా అని జనసేన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. బాబుతో పవన్ భేటీపై వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగడంతో, తిరుపతిలో అధికార పార్టీపై జనసేన నాయకులు ఎదురు దాడికి దిగడం అదే సూచిస్తోందని అంటున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ మద్దతుతో బరిలో నిలిస్తే…ఏమో గుర్రం ఎగరా వచ్చనే ఆశ తిరుపతి జనసేనలో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.