Pawan kalyan: అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో సగం బీసీలకే – పవన్ కల్యాణ్
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ నేతలు హానిలా వరాలు కురిపిస్తున్నారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం తప్పక వరిస్తుందని తెలిపారు. ఎక్కువ బీసీలు ఉన్న చోట మిగతా కులాలకు చెందిన వ్యక్తులు గెలుస్తున్నారు. వారే రాజ్యాధికారం అనుభవిస్తున్నారని అన్నారు. బీసీల అనైక్యతే దీనికి కారణం. బీసీలకు సాధికారిత రావాలని మాటలు చెప్పే నాయకుల్నే మీరు చూశారు. కానీ అధికారంలోకి వస్తే బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తానని పవన్ తెలిపారు.
నేను అన్ని కులాలను సమానంగా గౌరవిస్తా. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే ప్రయత్నం చేశాను. కోనసీమలో కాపులు, శెట్టిబలిజ కులాలను కలిపే ప్రయత్నం చేశాను. బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలి. కోనసీమలో ఇప్పుడు బలమైన మార్పు చూస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డులో సగం బీసీలకే కేటాయిస్తానని అన్నారు. బీసీలతో కలిసి కాపు నాయకులంతా అధికారం పంచుకోవాలని ఆయన పవన్ సూచించారు. ప్రభుత్వం 32వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతప్ప మరేమీచేయలేకపోయిందని అన్నారు.