Jana Sena: ఇప్పటంలో కూల్చివేతలపై జనసేన ఫైర్, రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు – మనోహర్
Jana Sena Statewide agitation against Ippatam incident
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడున్న పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించడంతో టెన్షన్ మొదలయింది. అధికారులు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలో దిగారు. ఇప్పటం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ గుంపులుగా కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఈ విషయంలో జనసేన తీవ్రంగా స్పందించింది. జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోలీసుల తీరును ఖండించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని మనోహర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందంతో ఇప్పటం గ్రామంలో భూములు ఇచ్చిన రైతుల ఇళ్లను కూలగొడుతున్నారని మనోహర్ ఫైర్ అయ్యారు. ఇప్పటం గ్రామంలోని కూల్చివేతలపై రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కార్యకర్తలను విడుదల చేయకపోతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టాలని మనోహర్ సూచించారు. మార్చి 14న మచిలీపట్నంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నామని కూడా మనోహర్ తెలిపారు. సభకు పోలీసుల అనుమతి తీసుకున్నామని వివరించారు.
విశాఖ సమ్మెట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తారనే ఉద్దేశంతో రెండు రోజులు వైసీపీపై విమర్శలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని మనోహర్ తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ..అందుకే విమర్శలు చేయకతప్పలేదని మనోహర్ తెలిపారు.