Nadendla Manohar: యువశక్తిలో కదం తొక్కనున్న యువత
Jana Sena PAC Chairman comments on Yuva Shakthi
జనసేన పార్టీ జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో యువశక్తి కార్యక్రమం చేపడుతోంది. యువత భవిత కోసం యువ శక్తి కార్యక్రమం చేపడుతున్నట్లు పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. వర్తమాన రాజకీయాలు, విద్య, వైద్యం గురించి మాట్లాడే కార్యక్రమమే యువశక్తి కార్యక్రమమని మనోహర్ అన్నారు. సభా వేదికపై 100 మంది యువత మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారని మనోహర్ గుర్తుచేశారు.
30 ఎకరాలు ప్రవేటు స్థలంలో సభ జరుగుతుందని, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏర్పాట్లు చేశామని, అనుమతులు ఇచ్చిన పోలీసులు యంత్రాంగానికి ధన్యవాదాలు అని మనోహర్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై యువత మాట్లాడేందుకు యువశక్తి చక్కటి అవకాశం కల్పిస్తోందని మనోహర్ గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాలో వలసల కార్మికులు, మత్సకారుల కోసం పవన్ కళ్యాణ్ పోరాడిన విషయాన్ని మనోహర్ గుర్తుచేశారు.
బాధ్యతగల పార్టీగా చట్టాన్ని గౌరవిస్తామని మనోహర్ తెలిపారు. అవినితి అక్రమాలు, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, భూఅక్రమాల పై యువత మాట్లాడాలని మనోహర్ సూచించారు. సభ తరువాత యువతను ఇబ్బందులకు గురిచేస్తే అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని, యువత వెనుక పవన్ కళ్యాణ్ ఉంటారని భరోసా ఇచ్చారు.