జగన్ సర్కార్‌పై జనసేన విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు. ఏలూరు చేరిన మనోహర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి
జగన్ సర్కార్‌పై జనసేన విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు. ఏలూరు చేరిన మనోహర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా మనోహర్ అన్నారు. నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. సంక్రాంతి తర్వాత పవన్ పోలవరం ప్రాంతంలో పర్యటిస్తారని మనోహర్ వెల్లడించారు. పవన్ సెక్యూరిటి విషయంలో మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి ఏలూరులో ఘనస్వాగతం పలికిన జనసేన శ్రేణులు
Link: https://t.co/mVejObkW8K pic.twitter.com/c9NqCuaNFD
— JanaSena Party (@JanaSenaParty) November 3, 2022
పవన్ కళ్యాణ్ భద్రతపై ఇటీవలే జనసేన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకు హాని ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అనుమానాస్పద వాహనాలు కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్‌ను అనుసరిస్తున్నాయని జనసేన నేతలు తెలిపారు. పవన్ ఇంటి వద్ద కూడా కొందరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పెరిగాయని ఆరోపణలు చేశారు.