Jana Sena: జనసేన ఆవిర్భావ సభకు పోటెత్తిన జనసైనికులు
Jana sena Formation day Celebrations in Machilipatnam
జనసేన పదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి జనసైనికులు మచిలీపట్నం చేరుకుంటున్నారు. మొత్తం 64 ఎకరాల స్థలం ఆవిర్భావ సభ కోసం సిద్ధం చేశారు. అందులో 34 సభా ప్రాంగణం కోసం కేటాయించగా..మిగతా స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. సభా ప్రాంగణం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న పవన్ అభిమానులు కూడా ఆవిర్భావ సభకు రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. వీరిందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వారాహి వాహనంలో పవన్
సాయంత్రం 5 గంటలకు సభావేదిక వద్దకు పవన్ కల్యాణ్..చేరుకోకున్నారు. నోవాటెల్ నుంచి ఆటోనగర్ బయలుదేరారు. వారాహి వాహనాన్ని పరిశీలించిన అనంతరం సభా స్థలికి చేరుకుంటారు. ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుండి వచ్చే జనసైనికుల కోసం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభ ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు.
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ జాషువా ఏర్పాట్లను పరిశీలించారు.
జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభకు చేరుకునేందుకు రూట్ మ్యాప్!
Google Maps Link:https://t.co/vAveD5eY2Z pic.twitter.com/aGHG06cNMC
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023
..