Jana Sena: జనసేన ఆవిర్భావ సభకు ఘనంగా ఏర్పాట్లు, పోలీసుల ఆంక్షలు
Jana Sena formation day Celebrations
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఆవిర్భావ సభ సందర్భంగా హైవేపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ జాషువా తెలిపారు. హైవేపై వెళ్లే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించవద్దని పోలీసులు జనసైనికులను కోరారు. పోలీసు అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మచిలీపట్నంలో ఆవిర్భావ సభ
జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న మచిలీ పట్నంలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నేతలు ఈ సభకు హాజరయ్యేందుకు తరలిరానున్నారు. బస్సుల్లో, కారుల్లో సభకు ర్యాలీగా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో జనసేన అధినేత పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. నాదేండ్ర మనోహర్ కూడా జనసేనానికి అండగా నిలిచి అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.