Jana Sena: జనసేన ఆవిర్భావ సభ షెడ్యూల్ మారే అవకాశాలు
Jana Sena Chief Pawan Kalyan will reach Machilipatnam by 7PM
జనసేన ఆవిర్భావ సభ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం చేరుకోడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో ఎక్కి మచిలీపట్నం చేరుకునేందుకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలియడంతో వేలాది మంది అభిమానులు రోడ్డుకు ఇరువైపులా చేరుకుని స్వాగతం పలుకుతున్నారు. దీంతో వారాహి వాహనం చాలా నెమ్మదిగా కదులుతోంది.
షెడ్యూల్ ప్రకారం 5 గంటలకు మచిలీ పట్నం సభకు చేరుకోవాల్సి ఉన్న పవన్ రాత్రి 7 గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. 4.30 సమయానికి బెజవాడ కానురు వరకు మాత్రమే పవన్ చేరుకున్నారు. ఇంకా 50 కిలోమీటర్లు మేర వెళ్లాల్సి ఉండటంతో సభాస్థలికి 7 గంటలకు చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Glimpse of crowd from the rally..#JSP10thFormationDayMeet pic.twitter.com/wiQ3MVxAkB
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023
జనసేనాని రాకకై ఉత్సాహంతో ఎదురు చూస్తున్న జనసైన్యం!#JSP10thFormationDayMeet pic.twitter.com/vx6Trsw2QF
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023
..