Jana Sena: కులాల మధ్య చిచ్చు పెట్టే కుతంత్రాలను నిలువరించాలి – పవన్ కళ్యాణ్
Jana Sena Chief Pawan kalyan Statement against the Caste disputes in AP
తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని తన ప్రకటన ద్వారా ప్రజలను కోరారు.
రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి
కులాల మధ్య అంతరాలు తగ్గించి అందరి మధ్య సఖ్యత పెంచాలని జనసేన పార్టీ తపిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోంది. ఇందుకు సంబందించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం అందుతోంది. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయి. బలిజలు, యాదవుల మధ్య సఖ్యత విచ్ఛిన్నం చేయడానికి కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా.. ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అంతరిపైనా ఉందని పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా ప్రజలను కోరారు.
కులాల మధ్య చిచ్చు రేపి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే బలిజలకి, యాదవులకి మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారని జనసేనాని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాల్లో వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బతీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా బేధ భావాలతో ఉండేలా చూడడమే కుట్రదారుల పన్నాగం అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/PyFR9htHu8
— JanaSena Party (@JanaSenaParty) March 17, 2023
Jana Sena