Kodi Kathi Case: కోడి కత్తి కి దొరకని బెయిల్..జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందే
Kodi Kathi Case: సీఎం జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. 2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్ పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పెను సంచలనంగా మారింది. పాదయాత్ర చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న జగన్ పై శ్రీనివాస్ చేసిన దాడిలో ఆయన భుజానికి చిన్నపాటి గాయమైంది. దీంతో జగన్… వైజాగ్ లో ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఈ కేసును కోర్టు ఎన్ఐఏకు అప్పగించింది.
56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. చార్జ్‌షీట్లో ఎందుకు లేవని ఎన్‌ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈనెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కీలక ఆదేశాలు ఇస్తూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని కీలక ప్రశ్నలు వేసింది.శ్రీనివాస్ బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్ధనను విజయవాడ ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
బాధితుణ్ణి విచారించిన తర్వాతే తక్కిన ప్రొసీజర్ చేయాలనీ ఆదేశాలిచ్చింది. 31 నుంచి విజయవాడ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు రావాలని కూడా ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో బాధితుడైన జగన్ ఇప్పటివరకూ కోర్టుకు రాకపోవడంపై న్యాయస్ధానం అభ్యంతరం తెలిపింది.