Chandrababu Naidu: జీవో నెం.1 కాపీలను భోగి మంటల్లోవేసిన వేసిన చంద్రబాబు
Chandrababu Naidu: తెలుగు రాష్టాల ప్రజలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేశామని అన్నారు. జీవో నెం.1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నిరసన తెలిపారు.
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనీ చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లెలో జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు పలువురితో సమావేశాలు నిర్వహించారు. ఇక నారా ఫ్యామిలీతోనే నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా నారావారి పల్లెలో సనాక్రాంతి సంబరాలు చేసుకోనుంది. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు నారావారి పల్లె కి చేరుకున్నాయి. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయి..పుంగనూరులో వందమంది పై పది రోజుల్లో మా కార్యకర్తలపై కేసులు పెట్టారు.. ఈ పండగగా పూట మావాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు..అని మంత్రి పెద్దిరెడ్డి నీ హెచ్చరించారు. అన్ని లెక్కలురాస్తున్నా వచ్చే పండక్కి ఎక్కడ ఉంటావో పెద్దిరెడ్డి చూసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక ఉదయాన్నే స్థానికులతో కలిసి భోగి మంటలు వేశారు కుటుంబమంతా. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన జీవో నెం.1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నిరసన తెలిపారు. అలాగే బాలయ్యకుడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చలి మంటలు కాగుతూ అందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు.