YCP MLA Musthafa: వైసీపీ ఎమ్మెల్యేపై ఐటీ రైడ్స్.. ఏమైందంటే?
YCP MLA Musthafa: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాల కలకలం రేగడం చర్చనీయాంశం అయింది. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారని, ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగిందని అంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ముస్తఫా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. అధికార వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల క్రితం ముస్తాఫా ప్రకటించడాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి తన కూతురు నూరి ఫాతిమా పోటీ చేస్తారని, తన నిర్ణయం వెనుక ఆర్థిక సమస్యలే కారణమని.. తగినంత డబ్బు లేని రాజకీయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయని ఆయన అన్నారు. తాను వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాని ముస్తాఫా అన్నారు. ఇక ముస్తాఫా రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటీ నుంచే ఆయన కూతురు నూరి ఫాతిమా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.