Bds Student Murder: వైద్య విద్యార్థిని మెడకోసి హత్య చేసిన ఐటీ ఉద్యోగి
Bds Student Murder: గుంటూరు జిల్లా లో బీడీఎస్ చదువుతున్న విద్యార్థిని హత్య కలకలంరేపింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు లో తపస్వి పై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు.. అతడు కూడా తన చేయికోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతిని గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం… నిందితుడు జ్ఞానేశ్వర్, మృతురాలికి రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు విద్యార్థిని స్నేహితురాలు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా మృతురాలు స్నేహితురాలి వద్దనే ఉంటోంది. మృతురాలి స్నేహితురాలు జ్ఞానేశ్వర్, మృతురాలి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పిలిచింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్‌తో యువతి మెడపై దాడి చేసాడు. నిందితుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.