IT Notices to Minister: మంత్రి జయరాంకు ఐటీ నోటీసులు… 17 లోగా వివరణ ఇవ్వాలి
IT Department Notices to Minister Jayaram: ఏపీ మంత్రి జయరాంకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం భార్య రేణుకమ్మ పేరుతో 30 ఏకరాలు, సన్నిహితుల పేరుతో మరో 90 ఎకరాల స్థలం రిజిస్టర్ కావడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. రేణుకమ్మకు ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఐటీశాఖ, అన్ని ఎకరాల స్థలం కొనుగోలు చేసేంత ఆర్థిక స్థోమత ఆమెకు లేదని, ఈ స్థలాన్ని మంత్రి జయరాం ఆమె పేరున కొనుగోలు చేశారని నిర్ధారించిన ఐటీ శాఖ ఆ 30 ఎకరాలను తాత్కాలికంగా ఎటాచ్ చేసింది.
అదేవిధంగా సన్నిహితుల పేరిట కొనుగోలు చేసిన మరో 90 ఎకరాలను కూడా ఐటీ శాఖ ఎటాచ్ చేసింది. భూముల రిజిస్ట్రేషన్ లో పేర్లు వేరే వారివి ఉన్నా, వాటి లబ్దిదారుడు మంత్రి జయరాం అవుతాడని నిర్ధారించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నది. అంతేకాకుండా ఈ భూములను అన్యాక్రాంతం చేయవద్దని స్ట్రాంప్స్ అండ్ రిజిస్ట్రార్ డిపార్ట్‌మెంట్‌కు ఐటీ శాఖ లేఖలు రాసింది. పీబీపీటీ చట్టం 1998 ప్రకారం రేణుకమ్మ పేరుమీద ఉన్న 30 ఏకరాల భూమిని తాత్కాలికంగా ఎటాచ్ చేస్తున్నట్లు ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.