ISRO successfully destroyed the satellite: శభాష్ ఇస్రో… విజయవంతంగా ఎంటీ 1 శాటిలైట్ ధ్వంసం
ISRO successfully destroyed the satellite: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సరికొత్త రికార్డ్ సృష్టించింది. పదేళ్ల క్రితం ప్రయోగించిన హేఘ ట్రోపికస్ 1 శాటిలైట్‌ను విజయవంతంగా ధ్వంసం చేసింది. దాదాపు పదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందించింది. భూవాతావరణంలో వస్తున్న మార్పులను అంచనా వేసేందుకు ఈ ఉపగ్రహాన్ని 2011లో ఫ్రెంచ్ గయానా నుండి అంతరిక్షంలోకి పంపారు. కాగా, ఈ ఉపగ్రహం పదేళ్లపాటు అనేక సేవలు అందించింది. కాగా, నిరుపయోగంగా మారిన ఈ శాటిలైట్‌ను విధ్వంసం చేయాలని నిర్ణయించిన భారత్ యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ శాటిలైట్‌ను భూకక్ష్యలోనే పేల్చివేసింది.
దీంతో ఈ శాటిలైట్ 27 వేల కిమీ వేగంతో ప్రవేశించి కాలి బూడిదైంది. దీనికి సంబంధించిన వ్యర్ధాలు పసిఫిక్ మహా సముద్రంలో పడిపోయినట్లు ఇస్రో పేర్కొన్నది. ఇప్పటి వరకు ఇలా శాటిలైట్‌లను ధ్వంసం చేయగలిగే టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే సొంతం కాగా, ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన నిలిచింది. అయితే, చైనా చేస్తున్న ఈ శాటిలైట్ ధ్వంసం ఉద్రిక్తంగా మారుతున్న తరుణంగా ఇండియా విజయవంతంగా ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం విశేషం. ఉపగ్రహాలను ప్రయోగించడమే కాకుండా నిరూపయోగంగా మారిన ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా కూల్చివేయగలదని కూడా నిరూపించుకుంది.