Jr Ntr: ఎన్టీఆర్‌ను నిజంగానే తొక్కేస్తున్నారా… టీడీపీ ఆ గేమ్స్ ఆడుతుందా?
Jr Ntr: సినిమా రంగంలో రాణించి ప్రజాధరణ పొందిన చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో రాణించి సీఎం అయినవారు కూడా ఉన్నారు. తెలుగునాట తెలుగుదేశం పార్టీని స్థాపించి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన సినీ నటుడు, ప్రముఖ రాజకీయవేత్త ఎన్టీఆర్. ఎన్టీఆర్ చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని నడిస్తున్నారు. ఎన్టీఆర్ నటవారసత్వంగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. సమయం ఆనసన్నమైనపుడు తప్పకుండా వస్తానని చెప్పారు.
ప్రచారం చేసే సమయంలో జూ. ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత కల్పించిన చంద్రబాబు, ఎప్పుడైతే రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టడం మొదలుపెట్టింది. ఆయనతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పార్టీకి తన అవసరం ఎప్పుడున్నా వస్తానని, తాత స్థాపించిన పార్టీ తప్పించి మరే పార్టీలో తాను చేరబోనని కూడా స్పష్టం చేశారు. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా తనదైన శైలిలో మౌనం వహిస్తు వచ్చారు. సినిమారంగంలో తిరుగులేని రారాజుగా ఎన్టీఆర్ రాణిస్తున్నారు. తనదైన హావభావాలు, నాట్యంతో ఆకట్టుకుంటున్నాడు.
వరస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. అయితే, రాజకీయాల విషయంలోకి వచ్చే సరికి తారక్‌ను తొక్కేయడానికి ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నారని, కావాలనే లోకేశ్‌ను రంగంలోకి దించి ఎన్టీఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారని వైఎసీపీ మాజీ ఎంపీ కొడాలి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వారసులెవ్వరూ రాజకీయాల్లోకి రాకుండా, రాజకీయాల్లో ఎదగకుండా తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కొడాలి నాని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్‌ను తొక్కడం కోసమే లోకేశ్‌ను ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఎంతటి బలం దమ్ము ఉంటాయో, అంతటి దమ్ము ధైర్యం ఒక్క జగన్‌లో మాత్రమే ఉన్నాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు. నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఎన్టీఆర్‌తో కలిసి మెలిసి తిరిగారు. ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. అయితే, నాని వైసీపీలో చేరిన తరువాత ఎన్టీఆర ని సైతం దూరం పెట్టారు.