AP Govt on GO 1: జీవో నెం 1 పై ఏపీ సర్కార్ వెనక్కి తగ్గుతుందా?
AP Govt on GO 1: కందుకూరు, గుంటూరులో జరిగిన బహిరంగ సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కొల్పోయారు. భవిష్యత్తులో అలాంటి పరిణామాలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెం 1 ను అమలులోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపైన, సందుల్లో గొందుల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పేర్కొంటూ జీవోను తీసుకొచ్చింది. అయితే, ఈ జీవో వచ్చిన తరువాత పోలీసులు ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న రోడ్‌షోలు, సభలను అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన జీవోను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేయడంతో జనాలు కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చేసిన ప్రచారం సక్సెక్ కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. పోలీసులు, అధికారులు సభలు, సమావేశాలపై అవగాహన కల్పించకుండా అడ్డుకోవడంతో నష్టపోతున్నామని గమనించిన వైసీపీ సర్కార్ జీవోలో మార్పులు చేసేందుకు సిద్దమౌతున్నది. ఒకవేళ మార్పులు చేయడం కుదరకుంటే, జీవోను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నది. సొంతపార్టీల నేతలు బహిరంగ ర్యాలీలు నిర్వహిస్తుండటం కూడా ఆందోళన కలిగించే అంశమే. సొంత పార్టీకి ఒకరూలు, ప్రతిపక్షాలకు మరో రూలా అని దుమ్మెత్తి సోస్తున్నారు. ఇక ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ కూడా ఈ అంశం వైసీపీకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉందని రావడంతో సర్కార్ పునరాలోచనలో పడింది.