Stampede in Guntur: గుంటూరు తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభం
Investigation started in Guntur stampede incident
ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట ఘటనపై విచారణ మొదలయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ చైర్మన్ శేష సాయిరెడ్డి విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన చోటుని సందర్శించారు. సభా ఏర్పాట్లు, నిర్వాహకులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలపై శేష సాయిరెడ్డి విచారించనున్నారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విచారణలో భాగంగా ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చేరుకున్నారు.
ఈ ఏడాది తొలి రోజున ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాల పంపిణీలో అపశృతి జరిగింది. వస్త్రాల కోసం వందలాది మంది మహిళలు చేరిన క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట సందర్భంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరులో చంద్రబాబు సభ సందర్భంగా చంద్రన్న కానుక ఇస్తారని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచే మహిళలు భారీ ఎత్తున సభా స్థలానికి తరలివచ్చారు. చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు సభకు వచ్చారు. ప్రసంగంలో పూర్తయిన తర్వాత చంద్రన్న కానునకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం సజావుగా జరగలేదు. నిర్వాహకులు సరైన ప్రణాళిక లేకుండా పంపిణీ చేపట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు.