Tirumala: ఈనెల 28 న శ్రీవారి రథసప్తమి వేడుకలు
Tirumala: తిరుమల తిరుపతి లో జరిగే రథ సప్తమి వేడుకలు నిర్వహించడానికి టీటీడీ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు రథ సప్తమి ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి 28వ తేదిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించబోతుంది టీటీడీ. ఒకే రోజున స్వామివారు ఏడూ హనాలైన.. సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం ,ఉదయం 11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం ,మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం,సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఈ సందర్బంగా 28వ తేదిన శ్రీవారి కి ఆర్జిత సేవలు రద్దు చేసింది పాలకమండలి. ఇక శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
ఇక శ్రీవారి ఆలయానికి బుధవారం రోజున 76,230 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.. 31,300 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా..స్వామి వారి హుండీ ఆదాయం 3.46 కోట్లు రూపాయలు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.