Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి సంబరాలు కోరెందుకున్నాయి. రంగు రంగుల ముగ్గులు, రతనాల గొబ్బిళ్లు, భోగి మంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లతో తెలుగు వారింట సంబరాలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతికి ముందు రోజే భోగి పండుగను జరుపుకుని తెగ ఎంజాయ్ చేసారు. భోగి సందర్భంగా భగభగ మండే మంటల్లో గోవు పిడకలు, పాత వస్తువులను వేసి పండుగ సంబురాలను ప్రారంభించారు.
సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా ఓవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు మందుబాబులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మద్యం దుకాణాల సమయవేళలను పెంచింది. సాధా రణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల్లో మద్యం విక్రయిస్తారు. అయితే పండుగల సందర్భంగా ఈ నెల 13వ నుంచి నేటి వరకు రాత్రి సమయం ఓ గంట పొడిగించారు. అంటే రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేవుంటాయి. ఇక సమయం పెంచడంతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు.