తుఫాను ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు
అసని తుఫాను ప్రభావం అన్నింటిపై పడుతుంది. తుఫాను వల్ల కోస్తా జిల్లాలో పలు బస్సులు, రైళ్లను రద్దు చేసిన అధికారులు.. తాజాగా ఫ్లైట్‌లను కూడా రద్దు చేశారు. అసని ప్రభావంతో విశాఖ, రాజమండ్రికి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయ సంస్థలు తెలిపాయి. ఇందులో భాగంగానే 22 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఇండిగోతో పాటు ఎయిరిండియా, ఎయిర్ ఏషియా కూడా విమాన సర్వీసులను రద్దు చేశాయి.
భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల విమానం లాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురకావచ్చని, దీంతో ముందస్తుగా పలు విమాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులను తిరిగి పునరుద్ధరించడంపై సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి.