కోర్టులో చోరీపై ఎస్పీ కామెడీ చేస్తున్నారు: సోము వీర్రాజు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. నెల్లూరు జిల్లా కోర్టులో చోరీపై స్పందించారు సోము వీర్రాజు. కోర్టులో చోరీ జరగడం తన జీవితంలో ఇప్పుడే చూస్తున్నానన్నారు. న్యాయస్థానంలో జరిగిన చోరిపై ఎస్పీ కార్యాయలంలో ఫిర్యాదు చేస్తే చోరీపై ఎస్పీ విజయరావు కామెడీగా మాట్లాడారన్నారు. న్యాయస్థానంలో చోరీ జరిగితే సీరియస్‌గా తీసుకోవాల్సిన పోలీసులే ఇలా కామెడీ చేయడం ఎంటని ప్రశ్నించారు.
జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ ఉద్యోగులను ఇంత వరకు పర్మినెంట్ చేయలేదన్నారు. జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడేదని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల మీదుగా యధేచ్చగా ఎగుమతి చేస్తున్నారని, సీఎం మాత్రం దానిని పట్టించకోవడం లేదని మండిపడ్డారు.