Somesh Kumar : పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సోమేశ్ కుమార్
Somesh Kumar: తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలంగాణ సర్వీస్ ల నుంచి వైదొలిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని ఆమధ్య కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు సోమేశ్ కుమార్ తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిన సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ న కలిశారు. అలాగే సాధారణ పరిపాలన శాఖకి రిపోర్ట్ చేసారు. సాధారణ పరిపాలన శాఖకి రిపోర్ట్ చేసి పది రోజులు గడుస్తున్నా ఇక పోస్టింగ్ ఎక్కడ అనేది ఇవ్వలేదు.
సోమేష్ కుమార్‌కు ఏ శాఖ అప్పగించాలా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గతంలో హైదరాబాద్ నగరపాలన లో కమిషనర్ గా చేసిన ఆయనకు మళ్ళీ కమిషనర్ పదవి పస్తుంది అని కొందరు అంటుంటే ..వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఏ శాఖ అప్పచెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని సోమేశ్ కుమార్ అన్నారు. ఇప్పుడు ఏ శాఖను అప్పచెప్పాలని ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. మరోవైపు సోమేష్ కుమార్‌కు మరో 11 నెలల తరువాత పదవి విరమణ చేయనుండడంతో ఉండటంతో ఆయనకు ఏ శాఖను అప్పచెప్పనున్నారని ఇప్పుడు ఉత్కంఠగా మారింది.