వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే ఎన్నికల బరిలో దిగుతానని వైసీపీ నేత బాలినేని స్పష్టం చేశారు. నేను మార్కాపురం, గిద్దలూరు, దర్శి వెళ్తానని కొంత మంది మాట్లాడుతున్నారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయ జీవితం ప్రారంభించింది ఒంగోలులోనే.. ఒంగోలు నుండే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
I will contest from Ongole itself, Says Balineni
వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే ఎన్నికల బరిలో దిగుతానని వైసీపీ నేత బాలినేని స్పష్టం చేశారు. నేను మార్కాపురం, గిద్దలూరు, దర్శి వెళ్తానని కొంత మంది మాట్లాడుతున్నారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయ జీవితం ప్రారంభించింది ఒంగోలులోనే.. ఒంగోలు నుండే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ తాను రాజీపడనని బాలినేని అన్నారు.
ఈమధ్య అయిన వాళ్లే నాపై కుట్ర చేస్తున్నారని బాధపడ్డానని, తనకు అయినవాళ్లు ఎవరూ లేరని, కార్యకర్తలే తనకు సర్వస్వమని అన్నారు. మా నాయకుడు జగన్ని తప్ప ఎవరినీ లెక్క చెయ్యనని బాలినేని తేల్చి చెప్పారు. జగన్ బటన్ నొక్కి ప్రజలకు సేవ చేస్తున్నారని, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నామని ఫీలౌతున్నారని బాలినేని గుర్తుచేశారు. కార్యకర్తల్ని సొంత మనుషులుగా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని బాలినేని అన్నారు.
గత కొంత కాలంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల ఇంటి పోరు చర్చనీయాంశంగా మారింది. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య వర్గ పోరు నెలకొంది. అనేక విషయాల్లో ఇద్దరి మధ్య అభిప్రాయబేదాలు తలెత్తాయి. తదనంతరం విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ విస్తృత ప్రచారం లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.