Nara Lokesh: లోకేష్ బస చేసిన ప్రాంతం వద్ద ఉద్రిక్తత
Nara Lokesh: తిరుపతి జిల్లా మదనపల్లిలో లోకేష్ బస చేసిన ప్రాంతం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఆయన ఉన్న నియోజకవర్గంలో ఓటర్ కానీ వాళ్ళు ఉండకూడదని తహసీల్దార్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల లోపు బస చేసిన ప్రదేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయగా లోకేష్ తో పాటు సిబ్బంది కూడా వెళ్లిపోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. లోకేష్ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. లోకేష్ ఇక్కడ నుంచి వెళ్లకపోతే..అరెస్ట్ చేసి బెంగళూరు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. లోకేష్ విడిది కేంద్రం వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసారు. 38 రోజుల్లో 500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారని, మిగిలిన 3500 కిలోమీటర్లను 365 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారని భావిస్తున్నారు.