MLC ELections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ కేంద్రం వద్ద హై అలర్ట్
MLC ELections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ కేంద్రం దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడతారని అనుమానంతో కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసు ఉన్నతాధికారులు భద్రత పెంచినట్టు చెబుతున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ప్రతి రౌండ్ కౌంటింగ్‌లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది, ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు స్కెచ్ వేశారని అంటూ ప్రచారం జరుగుతోంది. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు జేఎన్టీయూ కేంద్రం దగ్గర హైఅలర్ట్ ప్రకటించి భారీగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది. ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిలుపుదల చేయాలని వైసిపి పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
టిడిపి నేతలకి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఎనిమిదో రౌండ్లో వైసీపీ ఓట్లు టిడిపి అభ్యర్థికి కలిపారని పేర్కొన్నారు. ఈమేరకు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పిన రవీంద్రారెడ్డి మొత్తం రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు, వైసీపీ మెజార్టీ తగ్గుతుండడంతో…. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత కౌంటింగ్ ముగియగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు.ఇక మరో పక్క ఎమ్మెల్సీగా వేపాడ చిరంజీవి రావు గెలుపొందినట్టు ప్రకటించారు.