Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు… వైభవంగా గరుడసేవ…
Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రోజున శ్రీవారి గరుడసేవ ఉత్సవాలు నిర్వహించారు. శ్రీవారు గరుడవాహనంపై ఊరేగారు. ఈ సేవలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. తిరుమల మాడవీధులు భక్తులతో కిటకిటలాడాయి. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ప్రాధాన్యత ఉండటంతో ఈ సేవను తిలకించేందుకు ప్రతి ఏడాది భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు.
ఈ సేవ నాలుగున్నర గంటలపాటు కొనసాగింది. దాదాపుగా మూడు లక్షల మందికి పైగా భక్తులు ఈ వాహనసేవలో పాల్గొన్నారు. గరుడవాహనసేవ కార్యక్రమం వైభవోపేతంగా సాగింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం కోలుకోవడంతో బ్రహ్మాండనాయుకుని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.