విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)వినాయక చవితి (Vinayaka Chavithi) శుభాకాంక్షలను తెలియజేశారు.
Janasena Chief : విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)వినాయక చవితి (Vinayaka Chavithi) శుభాకాంక్షలను తెలియజేశారు. ఒక్క భారత దేశంలోనే కాకుండా..విదేశాలలో సైతం జరిగే ఈ వినాయక చవితి పండుగ.. ఒక ఘనమైన వేడుక అని పవన్ చెప్పారు. .
దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఇతర మతస్తులు పాల్గొనడమనేది భారతదేశంలో మత సహనానికి ఒక గీటు రాయిగా పవన్ చెప్పుకొచ్చారు. స్వతంత్ర పోరాటంలో వినాయక ఉత్సవాలు ఒక భాగంగా ప్రారంభమై.. ఇప్పటికీ దేదీప్యమానంగా కొనసాగడం అనేది భారతీయులకు వినాయక చవితి పండుగపై ఉన్న భక్తిశ్రద్ధలకి తార్కాణంగా నిలుస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
చాంద్రమాన పంచాంగం ప్రకారం హిందువులకు మొదటి పండుగైన ఈ గణేష్ చతుర్ధి.. తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధితో పాటు తెలుగు ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా..అందరికీ శుభాలు కలుగచేయాలని కోరుకున్నానని చెప్పారు. అంతేకాదు..కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్ధికంగా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆ లంబోదరుణ్ణి ప్రార్ధిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.