GVMC: విశాఖలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె..
GVMC: విశాఖ జీవీఎంసీ నీటి విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు మెరుపు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని తొలిసారిగా మేయర్, ప్రజాప్రతినిధుల ఇళ్లకు సహా నగరమంతా నీటి సరఫరా ఆపి.. ఒకరోజు మెరుపు సమ్మెకు దిగి..నిరసనలు చేపట్టారు. దీంతో విశాఖ నగరం లో ఉన్న 98 వార్డుల్లో నీటి సరఫరాని బంద్ చేసారు.
గతేడాది మార్చి 22 న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేయర్ ,కమిషనర్ గారికి వినతి పత్రం అందించాం దీనికి.. వారికీ మాకు ఒక ఒప్పందం కుదిరింది. అప్పటినుండి ఎవరి విధులకు వారు హాజరు అవుతున్నారు. కానీ సంవత్సరం దగ్గరపడుతున్న మా సమస్యలని పట్టించుకోలేక పోతున్నారు. అందువల్లే మేము 15 రోజులముందుగానే సమ్మె నోటీసు ఇచ్చాము. ఈరోజు మొత్తం కార్మికులందరూ ఎవరువీధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు.
డిపెండెడ్ ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు. అలాగే జీవో నంబర్ 7 ప్రకారం 18,500 సాలరీ ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేదాంట్లో కోతలు పెడుతుందని అన్నారు. పారిశుధ్యకార్మికులకు ఎంతగానో అన్యాయం జరుగుతుందని అన్నారు. అందువల్లే మేము ఈ మెరుపు సమ్మె చేస్తున్నామని కార్మికులు తెలిపారు.