Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరంలో విశాఖకు జగన్!
Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరంలో సీఎం వైజాగ్ రాబోతున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. సీఎం ప్రకటించే నాటికి నెలల్లో ఉన్న సమయం ఇప్పుడు రోజుల్లోకి వచ్చిందని, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఇక ఎన్నికల కోడ్ కారణంగా ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించ లేకపోయాం అని పేర్కొన్న ఆయన ఈ నెల 18 తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ విడుదల అవుతుందన్నారు. డిసెంబర్ 23 నాటికి రామాయపట్నం ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయని, ఆ రోజు తొలి వెసల్ రాబోతోందని అన్నారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార్డ్ అని అన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వచ్చే నెల నుంచి కార్యాచరణలోకి వస్తాయని చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ప్రతీవారం సమీక్షిస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను లీజ్ డీడ్ విధానం అనుసరిస్తున్నామని, ఐటీ & ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 35 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయని అన్నారు.