Gudivada Amarnath: విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం.. అప్పటి నుంచే?
Gudivada Amarnath on AP Excecutive Capital : విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కానీ మంత్రిగా ఉన్న అయ్యన్న ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడికి మందు ఎక్కువై, వయసు మీద పడి కళ్ళ వెంట నీళ్లు వస్తే అభివృద్ధి కోసం అని మీడియా ప్రచారం చేస్తోందని అంటూ ఎద్దేవా చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి, గిరిజన ప్రాంతాలను కాపాడిన ఘనత వైసీపీదేనని పేర్కొన్న అమర్నాధ్ బ్యాక్ వర్డ్ రీజియన్ డెవలప్ మెంట్ కోసం కేంద్రం విడుదల చేసిన వందల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు.
అన్యాయం చేసిన వాళ్ళు ఒకే చోట కూర్చుని మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని విమర్శించారు. విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అయ్యే సమయం దగ్గరకు వచ్చిందని, నా వ్యక్తిగత ఉద్దేశం ప్రకారం ఎటువంటి బిల్లు పెట్టకుండా సీఎం వైజాగ్ రావాలని కోరుకుంటానని అన్నారు. ఈ విద్యా సంవత్సరం తర్వాత ఎప్పుడైనా విశాఖ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుటుహ్ణదని అన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ వరకు బీఆర్ఎస్, కెఏ పాల్ పార్టీ రెండూ ఒకటేనని అన్నారు. వాటి గురించి చర్చ సమయం వృధా అని ఆయన అన్నారు.