Srisailam: ఉగాది బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో ఘనంగా ఏర్పాట్లు..దర్శన వేళల్లో మార్పులు
Grand arrangements for Srisailam Brahmotsavalu
శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే ఉగాది మహొత్సవాల సందర్భంగా అధికారులు కొన్ని మార్పులు చేశారు. స్వామివారి గర్బాలయ, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని సేవలను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు.
గురువారం నుంచి ఈ నెల 23 వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామి అమ్మవార్ల అలంకార, స్పర్శ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికుల సంఖ్య అధికంగా ఉంటుందని ప్రతి భక్తునికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ఏడాది పాటు భక్తుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది. కార్తీక మాసంలోను, శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. రానున్న ఉగాది బ్రహ్మోత్సవాలకు కూడా అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అత్యంత వైభంగా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.