GIS 2023: విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్
Global Investors Meet started in Vizag
విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ ప్రారంభం అయింది. సీఎం జగన్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖేశ్ అంబానీ, గ్రంధి మల్లికార్జున రావుతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీలతో సీఎం జగన్ ముఖాముఖి చర్చలు చేపట్టనున్నారు.
వనరులు విస్తారం, అవకాశాలు అపారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు వివరించనుంది. అనేక రాయితీలు కల్పించనుంది. వనరులు విస్తారం, అవకాశాలు అపారం అంటూ ప్రభుత్వం ప్రత్యేక వీడియోలు తయారు చేసింది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనుంది.
2 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని టార్గెట్ విధించుకుంది. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. 14 రంగాలను ప్రధానంగా ఎంపిక చేసింది. ఆ 14 రంగాల్లోనే భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఈ సమిట్ లో మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి సీఎం జగన్ ఈ స్టాల్స్ ను ఆవిష్కరిస్తారు.
Welcome To Visakhapatnam 💐#APGIS2023 #AdvantageAP #APGlobalInvestorsSummit2023 #Vizag #YSJaganDevelopsAP #AndhraPradesh #YSJagan #APCMYSJagan #Visakhapatnam https://t.co/jGLelO60Q0
— Global Investors Meet (@Meliyaputti) March 3, 2023
Today in #Visakhapatnam, the Global Investors Summit (#GIS) got underway.
YS Jagan Mohan, the chief minister of #AndhraPradesh, came at the grounds of Andhra University of Engineering to meet with investors and dignitaries. pic.twitter.com/PFZNdGpvv5
— Mohd Lateef Babla (@lateefbabla) March 3, 2023