Investors Summit: ఏపీలో తొలి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు.. ఎక్కడంటే?
Global Investors Summit at Vishakapatnam: వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఇన్వెస్ట్ మెంట్ సదస్సుకు విశాఖపట్నం వేదికైంది. మార్చి 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ సన్నాహాలపై పారిశ్రామిక వేత్తలు, ముఖ్య అధికారులతో మంత్రి అమర్నాథ్ సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల లభ్యతను పారిశ్రామిక వేత్తల ముందు ఆవిష్కరిస్తామని అన్నారు. ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ మారుతుందని బలంగా విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
ఏరో స్పేస్ డిఫెన్స్., గ్రీన్ ఎనర్జీ,. టెక్స్ టైల్, టూరిజం, అగ్రికల్చర్,ఫార్మా, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన మూడు ఇండస్ట్రియల్ కారిడార్లలో 50 వేల ఎకరాల భూములు సమీకరిస్తామని అన్నారు. ఇక అక్కడ పెట్టుబడులకు అనుకూలమైన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ మూడు విభాగాలు వుంటాయని, ప్రారంభ వేదికపై నుంచి శంకుస్థాపనలు, అగ్రిమెంట్ లు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పంపించామని, ఈ సమ్మిట్ కు రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు సమ్మిట్ కు హాజరు అవుతారని అన్నారు.