AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సికండ్ ఇయర్, ఒకేషనల్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలుర కన్నా ఎక్కువ మంది బాలికలే పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇక జిల్లాల వారీగా చూస్తే..కృష్ణా జిల్లా విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత సాధించగా…కడప జిల్లాకు చెందిన విద్యార్ధులు వెనక బడ్డారు. కడప జిల్లా ఉత్తీర్ణతా శాతం 50 శాతానికి పడిపోయింది.
రెండు సంవత్సరాల విద్యార్ధులలో 8 లక్షల 69 వేల మందికి పైగా విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. అందులో ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌కి చెందిన 2,58,449 మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. 61 శాతం మంది రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.
మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం మంది, బాలికలు 60 శాతం మంది పాస్ అయ్యారు. జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణా జిల్లాలో అత్యధికంగా 78 శాతం.. కడప జిల్లాలో అత్యల్పంగా 50 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జూలై 5ద తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చిన విద్యాశాఖ మంత్రి తెలిపారు.