భారత్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. మైకేలా కుచ్లర్‌తో చర్చించిన అనంతరం ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Germany investments in Andhra Pradesh
భారత్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. మైకేలా కుచ్లర్‌తో చర్చించిన అనంతరం ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను మైకేలా కుచ్లర్‌కు సీఎం జగన్ వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం జగన్ మైకేలా కుచ్లర్‌కు తెలిపారు.
మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి వివిధ రంగాలలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీని ఫోకస్డ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన భారత్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్. pic.twitter.com/WmqrbzEJBx
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 24, 2023