Ex minister Narayana: మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట
Ex minister Narayana: గత సంవత్సరం ఆంద్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల సందర్భంగా చిత్తూరు జిల్లా నెల్లేపల్లి జడ్పీ హైస్కూల్ లో ప్రశ్నాపత్రం లీకైంది. తెలుగు సబ్జెక్టు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటికి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ పాత్ర ఉందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనకు బెయిల్ లభించగా ఆ బెయిల్ ను హైకోర్టు రద్దు చేయడంతో నారాయణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నారాయణ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. దీంతో నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది. అయితే నారాయణ విద్యాసంస్థలకు తనకు సంబంధం లేదని నారాయణ గతంలోనే ప్రకటించారు. 2014లోనే తాను నారాయణ విద్యా సంస్థలకు రాజీనామా చేసినట్టుగా. పక్కా పథకం ప్రకారంగానే ప్రశ్నపత్రం లీకైందని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.