ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
ఏపీ మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో గల ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజీలో తిరుపతిలోని నారాయణ విద్యాసంస్థ ప్రమేయం నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నారాయణ ప్రస్తుతం ఏపీ సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారు. నారాయణ ఆరోగ్యం సరిగా లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం సోమవారం రాత్రే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. నారాయణను విచారణ నిమిత్తం విజయవాడకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.