కార్యకర్తలు-వలంటీర్ల మధ్య ముష్టి యుద్ధం
Nara Lokesh Padayatra : నంద్యాల (Nandyala)లో టీడీపీ (TDP) యువ నేత నారా లోకేశ్ (Lokesh) యువగళం పాదయాత్ర (Padayatra)మరో సారి ఉద్రిక్తంగా మారింది. బుధవారం టీడీపీ నేతలు అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య గొడవ ముగియక ముందే మరో సారి పాదయాత్రలో ముష్టియుద్ధం (Fighting) జరిగింది. టీడీపీ కార్యకర్తలను తోసి వేయటంతో వాలంటీర్లపై దాడి మొదలైంది. లోకేశ్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు వలంటీర్లు కొట్టుకున్నారు. ఈ దాడిని ఫోన్లో చిత్రీకరించిన కొందరు వీడియోలను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ (Post) చేశారు. దాంతో ఆ వీడియో(Vedio)లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ.
లోకేశ్ కుడిభుజానికి స్కానింగ్
పాదయాత్ర సమయంలో కుడిభుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్ నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నారు. 50 రోజుల నుంచి నొప్పితో బాధపడుతున్న లోకేశ్ పాదయాత్ర అనంతపురంలో ప్రవేశించిన సందర్భంగా గాయపడ్డారు. భారీగా జనం తరలిరావడంతో కార్యకర్తల తోపులాటతో లోకేశ్ కుడి భుజానికి గాయమైంది. అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్, ఫిజియో థెరపీ చేయించుకున్నా ఫలితం దక్కలేదు.