Tirumala Darshanam: నేటి నుండి తిరుమలలో ముఖ గుర్తింపు ప్రారంభం
Face Recognizing Technology in Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. లడ్డూ విక్రయాలు, గదుల గుర్తింపు తదితర అంశాల పారదర్శకంగా అమలు చేసేందుకు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. దీనిని నేటి నుండి అమలు చేయనున్నారు. కాగా, గదుల కేటాయింపు విషయంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గదుల కాషన్ డిపాజిట్ కేంద్రాల వద్ద మొదట ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. గదులు కేటాయించే సమయంలో ఎవరైతే వస్తారో, వారే కాషన్ డిపాజిట్ ను తిరిగి పొందేందుకు కూడా రావాలని, వారి ఫేస్‌ను రికగ్నైజ్ చేస్తేనే డబ్బులు తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ పద్దతి ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నట్లు టీటీడీ తెలియజేసింది. పాదర్శకత పెరుగుతుందని తెలియజేసింది. అదేవిధంగా సర్వదర్శనం కేంద్రాల వద్ద కూడా త్వరలోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లడ్డూలు జారీ చేస్తామని టీటీడీ తెలియజేసింది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది.