Mekathoti Sucharitha: వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలిపారు. అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయడం లేదని తాను తన నియోజకవర్గం ప్రత్తిపాడుకు మాత్రమే పరిమితమవుతానని ప్రకటించారు. ఆమెను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా నియమించినా .. ఆమెకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి సరైన సమాచారం ఇవ్వకుండానే అన్ని కార్యక్రమాలు స్థానిక నేతలే ఏర్పాటుచేస్తున్నారని వాపోయారు.ఇక గుంటూరు ఆమెను పట్టించుకునేవారు లేకుండా పోయారు.
ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆమె కి తిరిగి మళ్ళీపదవి వస్తుంది అనుకున్నతరుణంలో ఆమెను తప్పించారు. అంతకు ముందు హోంమంత్రిగా కీలక పొజిషన్‌లో ఉండేవారు. తనతో పాటు మంత్రులుగా ఉన్న వనిత లాంటి వారిని కొనసాగించి కీలక పదవులు ఇచ్చినా తనను మాత్రం పక్కన పెట్టారని ఆమె అసంతృప్తికి గురయ్యారు. అప్పుడే ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత జగన్ పిలిచి మాట్లాడటంతో చల్లబడ్డారు. తర్వాత జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే సీఎం జగన్ ఆమె విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సారి ప్రత్తిపాడు నుంచి కూడా ఆమెకు టిక్కెట్ ఇవ్వడం లేదని వైసీపీలో అంతర్గత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆమె వేరే పార్టీల వైపు చూస్తోందని ప్రచారం ప్రారంభించారు. ఇదంతా వైసీపీలో తనపై జరుగుతున్న కుట్రగా ఆమె భావిస్తున్నారు. కారణం ఏదైనా సుచరిత మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. వైసీపీలో కలకలం రేపుతోంది. ఇక సుచరిత పక్కపార్టీల వైపు చూస్తున్నారని సమాచారం.
resign,